Hiroshima day august 6th

Hiroshima Day – హిరోషిమా దురంఘతం ఆగస్టు 06

BIKKI NEWS (AUG. 06) : Hiroshima day August 6th 1945. హిరొషిమా మీద అణు బాంబ్ ప్రయోగించబడింది. 1945 ఆగష్టు 6 న ‘ఎనొల గే’ అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది.

Hiroshima day August 6th 1945.

ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాలలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది.

ఈ విస్ఫోటనంలో, 70,000 మంది ప్రజలు అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు.

ఆగస్టు 9న అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు.

ఇది ప్రపంచ చరిత్రలోనే, అతి ఖరీదైన యుద్ధంగా మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి. కాని మానవ చరిత్రలో మరిచి పోలేని పీడకలగా ఈ సంఘటన మిగిలి పోయింది.

1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా, యుద్ద బాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →