BIKKI NEWS (August 02) : Telangana BSc agriculture admissions 2026 counselling. తెలంగాణ రాష్ట్రంలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీలో 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్చుల్లో అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ఆగస్టు చివరి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Telangana BSc agriculture admissions 2026 counselling
నీట్ ఈజీ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈ యూనివర్సిటీలు తమ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
గతేడాది వరకు ఉమ్మడి కౌన్సిలింగ్ నిర్వహించిన ఈ మూడు యూనివర్సిటీలు ఈసారి వేరువేరుగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నాయి.
అగ్రికల్చర్ యూనివర్సిటీ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 13 వరకు, హార్టికల్చర్ అడ్మిషన్ల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16 వరకు, వెటర్నరీ యూనివర్సిటీలో కోర్సుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31 వరకు ఉన్న సంగతి తెలిసిందే.
