BIKKI NEWS (August 01) : Salaries for Contract employees in Telangana. తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ లకు, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు క్రెడిట్ కావడం చాలా సంతోషకరమని తెలంగాణ జేఏసీ కో – చైర్మన్ టీజీడిసిఎల్ఏ ప్రెసిడెంట్ ఎం. వినోద్ కుమార్ తెలిపారు.
Salaries for Contract employees in Telangana
కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మొదటి తేదీన వేతనాలు ఎన్నో సంవత్సరాల కల అని గౌరవ సీఎం, మరియు విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి మరియు ఆర్థిక శాఖ అధికారులు మరియు కమిషనర్ మేడం గారికి, అధికారులకు, తెలంగాణ జేఏసీ కో – చైర్మన్ టీజీడిసిఎల్ఏ ప్రెసిడెంట్ ఎం. వినోద్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు,హర్షం వ్యక్తం చేశారు .
ఈ సందర్భంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు.
