Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – tigla - bikki news

Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

BIKKI NEWS (JUNE 10): Recruitment of guest faculty in GJCs – TIGLA. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.

Recruitment of guest faculty in GJCs

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుండి పునఃప్రారంభమైనప్పటికీ, అనేక కళాశాలల్లో ఇప్పటికీ అధ్యాపకుల కొరత కొనసాగుతుండడం వల్ల విద్యా బోధన కార్యక్రమాలు సక్రమంగా సాగడం లేదు. అదేవిధంగా దీని ప్రభావం విద్యార్థుల అడ్మిషన్లపై కూడా పడుతుంది. కళాశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే గెస్ట్ అధ్యాపకులను నియమిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. విద్యార్థుల పురోగతి కోసం మధ్యాహ్న భోజనం, యూనిఫాం వంటి ఎన్నో పథకాలను ప్రకటించిన ప్రభుత్వం ముఖ్యమైన బోధనకు సంబంధించి గెస్ట్ అధ్యాపకులను నియమించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

ఈ నేపథ్యంలో, విద్యార్థుల విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత ఏడాది పనిచేసిన 892 మంది గెస్ట్ అధ్యాపకులను ఈ సంవత్సరం జూన్ 1 వ తేదీ నుండి కొనసాగించాలని, అదేవిధంగా ఈ మధ్య జరిగిన ప్రిన్సిపల్ పదోన్నతుల కారణంగా ఏర్పడిన 100 కు పైగా అధ్యాపక ఖాళీలను తక్షణమే గెస్ట్ అధ్యాపకులతో నియమించాలని టిగ్లా అధ్యక్ష కార్యదర్శులు మైలారం జంగయ్య, నయీం పాష లు డిమాండ్ చేశారు.

ఈ అంశంపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటర్మీడియట్ విద్య గారికి సంఘం తరపున లేఖలను పంపినట్లు వారు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →