Daily gk bits part 149 - జనరల్ నాలెడ్జ్ బిట్స్ - bikki news

Daily GK bits part 149 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

BIKKI NEWS : Daily GK bits part 149 for compititive exams. జనరల్ నాలెడ్జ్ బిట్స్

Daily GK bits part 149 for compititive exams

1) గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం ఏ రాజ్యాంగ సవరణ చేశారు.?
జ : 73వ రాజ్యాంగ సవరణ

2) ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి అంతరాత్మ వంటివి అని ఎవరు పేర్కొన్నారు.?
జ : అంబేద్కర్

3) ఆదేశిక సూత్రాలలో ఇప్పటి వరకు అమలుకు నోచుకోని అంశం ఏది.?
జ : ఉమ్మడి న్యాయస్మృతి

4) ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాలలో ఎన్ని నూతన అధికరణలను చేర్చారు.?
జ : 7

5) ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణ ఏర్పడితే ప్రాథమిక హక్కులే చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఏ తీర్పు సందర్భంగా ప్రకటించింది.?
జ : చంపకమ్ దొరాయ్ రాజన్ కేసు (1951)

6) 1976 లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ని ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చారు.?
జ : 4

7) కేరళలో దళిత జాతుల అభివృద్ధి కోసం కృషి చేసిన వారిలో ప్రముఖులు.?
జ : నారాయణ గురు

8) జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1873

9) మహారాష్ట్రలో నిమ్న జాతుల అభివృద్ధి కోసం పాటుపడిన వారిలో ప్రముఖులు.?
జ : జ్యోతిరావు పూలే

10) గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయని అంశం ఏది.?
జ : పీడనం

11) ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది.?
జ : డెసిబుల్స్ (dB)

12) పరస్రవ్య ధ్వనిని వినగలిగే జీవి ఏది.?
జ : ఖడ్గ మృగం

13) అతి ధ్వనిని వినగలిగే జీవి ఏది.?
జ : గబ్బిలం

14) గాలి దేని ద్వారా ప్రయాణించదు.?
జ : శూన్యం

15) సోనార్ లో ఉపయోగించే ధ్వని ధర్మం ఏది.?
జ : పరావర్తనం

16) ఎన్ని డేసిబుల్స్ దాటిన ధ్వనిని ధ్వని కాలుష్యంగా పరిగణించవచ్చు.?
జ : 80 డెసిబిల్స్

17) గాలిలో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది

18) గాలిలో సాంద్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది

19) ప్రతి నాదం అంటే ఏమిటి.?
జ : 0.1 సెకండ్ కాలం కంటే తక్కువ కాలంలో పరావర్తన ధ్వని అసలు ధ్వని తో కలిసిపోవడం వలన ఏర్పడే ధ్వని

20) భారతదేశంలో దుమ్ము తుఫానులు ఏ నెలలో అధికంగా వస్తాయి.?
జ : మే

21) భారతదేశ మొత్తం భూభాగంలో ఎంత శాతం వరదలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.?
జ : 12%

22) ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణమైన కాంతి ధర్మం ఏమిటి.?
జ : కాంతి వక్రీభవనం, కాంతి విక్షేపనం, సంపూర్ణ అంతర పరావర్తనం.

23) సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో కనిపించే సూర్యుని భాగం ఏది.?
జ : కరోనా

24) ఖగోళ ప్రమాణం (AU) ఏ రెండిటి మధ్య దూరానికి సమానం.?
జ : భూమి సూర్యుని మధ్య దూరం

25) బాల్ పాయింట్ పెన్ ఏ ధర్మం ఆధారంగా పని చేస్తుంది.?
జ : గురుత్వాకర్షణ శక్తి

26) రెండు దర్పణాలను 60 డిగ్రీల కోణంలో అమర్చిన వాటిలో ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య.?
జ : 5

27) క్యాండిల్ లోని దారం ద్వారా మైనం పైకి రావడాన్ని ఏ ధర్మం తెలియజేస్తుంది.?
జ : కేశనాళీకీయత

28) స్పిన్ బౌలర్ ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాడు.?
జ : బెర్నౌలీ నియమం

29) కెమెరాలోని ఏ భాగం కంటిలోని రేటీనాను పోలి ఉంటుంది.?
జ : ఫిల్మ్

30) అంతరిక్ష యాత్రికుడికి అంతరిక్షం ఏ రంగులో కనిపిస్తుంది.?
జ : నలుపు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →