Ehs deduction - హెల్త్ స్కీం కు 1. 5% మినహాయింపు పై ఆందోళన.! - bikki news

EHS Deduction – హెల్త్ స్కీం కు 1.5% మినహాయింపు పై ఆందోళన.!

BIKKI NEWS (MAY 31) : EHS Deduction in Telangana employees may salary. EHS Deduction విషయంలో ప్రస్తుతం IFMIS Bill Preview లో “Employee Health Scheme” అనే కొత్త కాలమ్ కనిపిస్తోంది. Basic Pay పై 1.5% చొప్పున డిడక్షన్ ఆటోమేటిక్‌గా లెక్కించబడుతున్నట్లు గమనించాం.

EHS Deduction in Telangana employees may salary

అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు (GO/Memo) లేదా DDOలకు ప్రత్యేక సూచనలు అందుబాటులోకి వచ్చినట్లు తెలియడం లేదు. ఉద్యోగుల నుండి Option తీసుకుంటామని ప్రారంభంలో చెప్పినప్పటికీ, ప్రస్తుతం సిస్టమ్‌లో నేరుగా డిడక్షన్ కనిపించడం అనేక సందేహాలకు దారితీస్తోంది.

ఇది Trial Configuration మాత్రమేనా? లేక May-2026 Salary (Payable on 01-06-2026) నుండి అమలులోకి వచ్చే అసలు డిడక్షన్‌నా? అనే విషయంపై అధికారిక స్పష్టత అవసరం ఉంది.

Bill Finalization మరియు Government Approval పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు మరియు సంబంధిత శాఖలు అధికారికంగా స్పందిస్తే ఉద్యోగులకు మరింత స్పష్టత వస్తుంది.

ఉద్యోగి లేదా DDO ప్రత్యేక చర్య లేకుండానే సిస్టమ్‌లో EHS సంబంధిత వివరాలు కనిపిస్తే, దానికి కొన్ని అవకాశాలు ఉండవచ్చు:

  • పరీక్ష (Trial/UAT) కోసం సిస్టమ్‌లో ముందస్తు మార్పులు చేసి ఉండవచ్చు.
  • ఆప్షన్ నమోదు చేసిన ఉద్యోగుల డేటాను మ్యాప్ చేసి ఉండవచ్చు.
  • అమలుకు ముందు సాంకేతిక పరిశీలన (backend testing) జరుగుతూ ఉండవచ్చు. లేదా నిజంగా అమలుకు సిద్ధం చేస్తున్నా, అధికారిక ఉత్తర్వులు ఇంకా విడుదల కాలేకపోయి ఉండవచ్చు.

EHS Deduction విషయంలో ఇంకో అంశం గమనించాల్సిన అవసరం ఉంది.

సాధారణంగా Subscription ఆధారిత కోతలు (GIS, TGLI మొదలైనవి) ప్రభుత్వం నిర్ణయించిన నియమాల ప్రకారం ఉంటాయి. శాతం ఆధారంగా కోత విధించినా, దానికి సంబంధించిన ప్రామాణిక బేస్ మరియు లెక్కింపు విధానం స్పష్టంగా ఉంటుంది.

కానీ ప్రస్తుతం Bill Preview లో కనిపిస్తున్న EHS Deduction ను పరిశీలిస్తే, సెలవులో ఉన్న కొంతమంది ఉద్యోగుల విషయంలో కూడా వారి పూర్తి Basic Pay ను ఆధారంగా తీసుకోకుండా, ఆ నెలలో Draw అయిన Pay ఆధారంగా సుమారు 1.5% చొప్పున లెక్కించినట్లు కనిపిస్తోంది.

అందువల్ల ఇది పూర్తిస్థాయి అమలుకు సిద్ధమైన Final Calculation కంటే, సిస్టమ్‌లో జరుగుతున్న Trial/Testing Configuration లో భాగంగా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఇది కేవలం సిస్టమ్‌లో కనిపిస్తున్న లెక్కల ఆధారంగా చేసిన పరిశీలన మాత్రమే. అధికారిక ఉత్తర్వులు, Finance Department స్పష్టీకరణ లేదా Final Pay Slip ఆధారంగానే తుది నిర్ణయానికి రావడం సముచితం.

అందువల్ల ప్రస్తుతానికి ఈ Deduction ను Final గా భావించకుండా, బిల్లు పూర్తి స్థాయిలో ప్రాసెస్ అయ్యే వరకు వేచి చూడడం మంచిది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →