BIKKI NEWS (june 29) : Village Current officer jobs in Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12,000 విలేజ్ కరెంట్ ఆఫీసర్ ఉద్యోగాలను సృష్టించి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ కోసం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Village Current officer jobs in Telangana
నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కం లో పనిచేయడానికి ఈ ఔట్ సొర్సింగ్ ఉద్యోగులను నియమించనున్నట్లు సమాచారం.
ఈ పోస్టులను స్థానిక ఎలక్ట్రీషియన్లతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
గ్రామాలలో, పొలాల్లో ఎక్కడ కరెంటు సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు ఈ వ్యవస్థ తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఉద్యోగులకు నెలకు 15 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
