BIKKI NEWS (MAY 01) : May day 2026 special essay by Parasuraman mabbu. మే డే చరిత్ర కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటంతో ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో పరిశ్రమలు పెరిగినప్పుడు కార్మికులు రోజుకు 12–16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా వారు 8 గంటల పని విధానం కోసం ఉద్యమాలు ప్రారంభించారు.
May day 2026 special essay by Parasuraman mabbu
ఈ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటన హెమార్కేట్ ఎఫైర్. 1886 మే 1న అమెరికాలోని చికాగోలో వేలాది కార్మికులు సమ్మె చేసి తమ హక్కుల కోసం పోరాటం చేశారు.మే 4న జరిగిన హేమార్కెట్ సభలో హింసాత్మక ఘటనలు జరిగాయి,ఇందులో అనేక మంది కార్మికులు మరియు పోలీసులు మరణించారు.vఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమానికి చిహ్నంగా మారింది. తరువాత 1889లో అంతర్జాతీయ కార్మిక సంఘాలు మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే 1న మే డేను జరుపుకుంటున్నారు.
డా.బి.ఆర్.అంబేద్కర్ గారు కార్మికుల, కర్షకుల హక్కులు, గౌరవం, సమానత్వాన్ని కోసం ఎనలేని కృషి చేశారు.కార్మికుల త్యాగం వల్లనే నేడు కార్మికులకు మెరుగైన హక్కులు, సౌకర్యాలు లభిస్తున్నాయి. మన దేశంలో లో కూడా మే డేను ఘనంగా జరుపుకుంటారు
పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగం వంటి అన్ని రంగాల్లో కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వారు లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదు. కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివారు. ప్రతి భవనం, రహదారి, కర్మాగారం వారి కష్టంతోనే నిర్మితమవుతుంది. అయినప్పటికి కొన్ని చోట్ల కార్మికులు తక్కువ వేతనం, అసురక్షిత పరిస్థితులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల మే డే మనకు కార్మికుల హక్కులను రక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుంది. వారికి సముచిత వేతనం, భద్రత, గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
మొత్తానికి, మే డే కేవలం ఒక పండుగ మాత్రమే కాదుఇది కార్మికుల కష్టానికి గుర్తింపుగా, వారి హక్కుల కోసం పోరాటానికి చిహ్నంగా నిలుస్తుంది. మనమందరం కార్మికులను గౌరవించి, వారి సంక్షేమానికి కృషి చేయాలి.
✍️ మబ్బు పరశురామ్ లెక్చరర్
9703648173.

