BIKKI NEWS (APRIL 21) : TGPSC Assistant Scientist job notification 2026 in TGPCB. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ – తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో స్టెట్ లెవెల్ 20 అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ 2) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది..
TGPSC Assistant Scientist job notification 2026 in TGPCB
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 27 నుండి మే 25 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్ష జూలై 2026 లో నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్ 2) – 20 (స్టేట్ లెవల్ కేడర్)
అర్హతలు : కెమిస్ట్రీ సబ్జెక్టు తప్పనిసరిగా కలిగి ఉన్న బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్థులు జూలై 01- 2026 నాటికి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 1080/- (SC, ST, PWD అభ్యర్థులకు 580/- ) రూపాయలు.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేసిక్ టెస్ట్ పద్ధతిలో రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
వేతన స్కేలు: 45,960/- నుండి 1,24,150/-
TGPSC OFFICIAL WEBSITE
NOTIFICATION PDF FILE

