Ambedkar jayanti - కళ్ళెం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు - bikki news

Ambedkar Jayanti – కళ్ళెం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కళ్ళెం (ఏప్రిల్ 14) : Ambedkar Jayanti Celebrations in Kallem Village. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం- కళ్ళెం అధ్యక్షులు మబ్బు క్రాంతి కుమార్ అధ్యక్షతన భీమ్ బైక్ ర్యాలీ మరియు అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Ambedkar Jayanti Celebrations in Kallem Village

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి గారు భీమ్ బైక్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జయంతి వేడుకలలో కేక్ కట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అంబేద్కర్ గారి జయంతిని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ చిటకోడురు బిక్షపతి గారు మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు గొప్ప ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు,ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించారు, సమసమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరుకున్నారని, అలాగే అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను ప్రజలలోకి తీసుకెళ్లాలని కులాలకు, మతాలకు అతీతంగా అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవాలని తెలిపారు.

అలాగే లెక్చరర్ మబ్బు పరశురామ్, డా. మబ్బు సత్యనారాయణ గారు మాట్లాడుతూ… అంబేద్కర్ గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్ళి రాజ్యాంగ విలువలను ప్రజలకు తెలియజేయాలని మాట్లాడారు.
అదే విధంగా అందరూ వక్తలు అంబేద్కర్ గారు చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ యువజన సంఘాల సమాఖ్య నాయకులు, యువకులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →