BIKKI NEWS : Daily GK Bits in Telugu part 141 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్ .
Daily GK Bits in Telugu part 141
1) మెదక్ కేథడ్రాల్ చర్చి ఏ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది.?
జ : 20 వ శతాబ్దం
2) తెలంగాణ రాష్ట్ర గణాంకాలు 2021 ప్రకారం పట్టణ జనాభా శాతం.?
జ : 39%
3) 2021లో ఏర్పరచిన నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం తెలంగాణ ఎన్ని జోనులుగా విభజించబడింది.?
జ : ఏడు
4) దేశంలో ఉష్ణ మండలం పొడి అడవుల సగటు వార్షిక వర్షపాతం పరిధి.?
జ : 51 నుంచి 151 సెంటీమీటర్లు
5) తెలంగాణ రాష్ట్ర గణాంకాలు 2021 ప్రకారం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 10
6) పావురం బఠాని అని ఏ ప్రాంత కందిపప్పుకు పేరు.?
జ : తాండూరు ఎర్ర కందిపప్పు
7) ఇటీవల జి ఐ ట్యాగ్ పొందిన తాండూరు ఎర్ర కందిపప్పులో ఉండే ప్రోటీన్ శాతం.?
జ : 22 నుండి 24%
8) కాకతీయ రాజవంశం పరిపాలించిన శతాబ్దాలు.?
జ : 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు
9) అద్దంకి గంగాధర కవి ఎవరి ఆస్థాన కవి.?
జ : కులి కుతుబ్ షా
10) తెలంగాణలో ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది.?
జ : పోచంపల్లి
11) నిర్మల్ హస్త కళలు ఏ రాజవంశ కాలంలో ప్రారంభమయ్యాయి.?
జ : కాకతీయ
12) వెండి లోహపు తీగలతో చేసే తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రత్యేక కళ పేరు ఏమిటి?
జ : బిద్రి క్రాఫ్ట్
13) 1947 ఆగస్టు లో భారత్ స్వతంత్రం పొందిన తర్వాత, హైదరాబాద్ రాజ్యం ఎన్ని నెలల పాటు స్వతంత్ర సంస్థానంగా ఉంది.?
జ : 13 నెలలు
14) తెలంగాణ విద్యావంతుల వేదిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 2006
15) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (SRC) తన నివేదికను ఎప్పుడు సమర్పించింది .?
జ : 1955 సెప్టెంబర్ 30
16) బెల్ మెటల్ క్రాఫ్ట్ అని ఏ హస్తకళకు పేరు.?
జ : డోక్రా
17) తెలంగాణ రాష్ట్ర ఘణాంకాలు 2021 ప్రకారం జన సాంద్రత ఎంత.?
జ : 321
18) తెలంగాణలో ఎన్ని పక్షి జాతులు ఉన్నాయి.?
జ : 500 కు పైగా
19) తెలంగాణలో ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి.?
జ : 2939 పైగా
20) ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక ప్రకారం తెలంగాణలో 2015 నుండి 2021 మధ్య అటవీ విస్తీర్ణ శాతం ఎంతగా పెరిగింది.?
జ : 6.85%
21) ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది.?
జ : మంచిర్యాల
22) మానవ అభివృద్ధి సూచిక(HDI) ను UNDP ఏ సంవత్సరం నుండి ప్రకటిస్తున్నారు.?
జ : 1990
23) డీప్ గ్రేస్ ఎక్కా అనేది ఏ క్రీడకు సంబంధించిన పదం.?
జ : హాకీ
24) నైట్రోజన్ వాయువు భూవాతావరణంలో ఎంత శాతం ఉంటుంది.?
జ : 78%
25) తాగునీటిలో సిఫారసు చేయబడిన రాగి లోహం యొక్క గరిష్ట పరిమాణం ఎన్ని PPM లు.?
జ : మూడు
26) తెహ్రీ డ్యామ్ ఏ నది పై నిర్మించబడింది.?
జ : భాగీరధి
27) సోడియం హొడ్రాక్సైడ్ PH విలువ సుమారు.?
జ : 14
28) చీమ కుట్టినప్పుడు విడుదలయ్యో ఆమ్లం ఏది.?
జ : మిథనోయిక్ ఆమ్లం
29) గాయిటర్ వ్యాధి దేని లోపం వలన వస్తుంది.?
జ : అయోడిన్
30) కుతుబ్ షాహీ రాజ్యవంశం తొలి రాజధాని నగరం ఏది.?
జ : గోల్కొండ

