Daily gk bits in telugu part 139 - జీకే బిట్స్ - bikki news

DAILY GK BITS IN TELUGU PART 139 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 139 for COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్ .

DAILY GK BITS IN TELUGU PART 139

1) హైదరాబాద్ రాష్ట్రానికి 1952లో జరిగిన ప్రజాస్వామ్యయుత ఎన్నికల్లో మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు .?
జ : బూర్గుల రామకృష్ణారావు

2) తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీని స్థాపించినది ఎవరు.?
జ : యం. చెన్నారెడ్డి

3) మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పాఠశాలల రూపురేఖలు మార్చడానికి ప్రారంభించింది.?
జ : 26,065

4) మెదక్ కేథడ్రల్ చర్చిని ఎవరు నిర్మించారు.?
జ : చార్లెస్ వాకర్ ఫాస్నెట్

5) రాజా రాజేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలో ఏ పట్టణంలో ఉంది.?
జ : వేములవాడ

6) తెలంగాణలోని మొత్తం రోడ్డు నెట్వర్క్ లో గ్రామీణ రహదారుల శాతం ఎంత.?
జ : 61.80%

7) తెలంగాణ రాష్ట్రం 2019 – 2020 మరియు 2020 – 2021 సంవత్సరాలలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది.?
జ : 14.6%

8) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం జనావాస గ్రామాల సంఖ్య ఎంత.?
జ : 9824

9) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం ఎంత.?
జ : 61.12%

10) మంజీరా వన్యప్రానుల అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది.?
జ : సంగారెడ్డి

11) తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని క్షీరద జాతులు ఉన్నట్లు ఘనంకాలు చెబుతున్నాయి.?
జ : 103

12) తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం మిల్లిమీటర్లలో.?
జ : 905.4 m.m.

13) అల్యూమినియం భూపటలంలో ఏ రూపంలో లభ్యమవుతుంది.?
జ : బాక్సైట్

14) మార్గరేటా బొగ్గు నిక్షేపాలు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : అసోం

15) మైకా ఉత్పత్తి లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానంలో

16) పీట్ అనే బొగ్గును ఏమని పిలుస్తారు.?
జ : కర్ర బొగ్గు

17) కాకతీయుల చివరి రాజు ఎవరు.?
జ : ప్రతాపరుద్రుడు

18) బహమనీ రాజ్యస్థాపకుడు ఎవరు.?
జ : హసన్ గంగూ

19) విలాస తామ్ర శాసనం ఎవరు వేయించారు.?
జ : ముసునూరి ప్రోలయ నాయకుడు

20) రసాయనాల రాజు అని ఏ రసాయనాన్ని అంటారు.?
జ : సల్ప్యూరిక్ ఆమ్లం (H₂SO₄)

21) భారత రాజ్యాంగంలో పౌరుల విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు.?
జ : 42వ

22) సింధూ నది జన్మస్థలం ఏది?
జ : టిబేట్ లోని మానస సరోవర్ సరస్సు

23) పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : కేరళ

24) ఉత్తర భారత దేశంలో గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడిన మైదాన ప్రాంతం ఎన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.?
జ : 2,400 కిలోమీటర్లు

25) హిమాలయ పాదాల వద్ద ఉండే బంగర్, ఖాదర్ నేలలలో ఏది సారవంతమైనది.?
జ : ఖాదర్

26) హిమాలయాల వెలుపలి సరైనని ఏమంటారు.?
జ : శివాలిక్స్

27) భారతదేశ వైశాల్యంలో పీఠభూమి ప్రాంతం యొక్క శాతం ఎంత.?
జ : 27%

28) శబ్దాన్ని వాయు కాలుష్య జాబితాలో చేర్చడానికి వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు సవరించారు.?
జ : 1987

29) ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారకం ఏది.?
జ : క్లోరో ఫ్లోరో కార్బన్స్

30) మానవులతో సహా ఇతర జీవరాశులు జీవించే వాతావరణంలోని అత్యంత దిగువ పొరను ఏమంటారు.?
జ : ట్రోపో ఆవరణం

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →