Today in history - చరిత్రలో ఈరోజు ఆగస్టు 17. - bikki news

Today in history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 17.

BIKKI NEWS : Today in history August 17th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 17.

Today in history August 17th

దినోత్సవం

  • ఇండోనేషియా స్వాతంత్ర్య దినోత్సవం

సంఘటనలు

1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
1985: పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.

జననాలు

1866: మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు (మ.1911).
1908: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1966)
1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).
1939: మోదడుగు విజయ్‌ గుప్తా, కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు.
1949: తెలుగు గేయ రచయిత భువన చంద్ర .
1950: శరత్ సక్సేనా , హిందీ , తెలుగు,తమిళ, మలయాళ చిత్ర ప్రతి నాయకుడు.
1961: అనామిక, హిందీ నవలా రచయిత్రి, కవయిత్రి.
1962: మాకినీడి సూర్య భాస్కర్, ఆంగ్ల ఉపాధ్యాయుడు. సాహితీవేత్త.
1964: ఎస్.శంకర్, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా దర్శకుడు.
1983: శ్రీకృష్ణ , తెలుగు నేపథ్య గాయకుడు .
1993: నిధి అగర్వాల్ , హిందీ, తెలుగు చిత్రాల నటి.

మరణాలు

1786 : ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (జ.1712).
1817: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, గుంటూరు ప్రాంతమును పరిపాలించిన కమ్మ రాజు, అమరావతి సంస్థాన పాలకుడు (జ.1761).
1955: సాహీతీ వి’శారద’, ఆయన ‘ప్రజావాణి’ అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924).
1980: కొడవటిగంటి కుటుంబరావు, ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది (జ.1909).
1997: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత (జ.1925).
2002: ఋష్యేంద్రమణి , తెలుగు రంగస్థల , సినిమా నటి
2007: దశరథ్‌ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →