STANDARD GK BITS IN TELUGU – 114 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

Standard gk bits in telugu - 114 - జనరల్ నాలెడ్జ్ బిట్స్ - bikki news

BIKKI NEWS (FEB. 05) : Standard GK bits in Telugu 114. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

Standard GK bits in Telugu 114

1) అగుల్లాస్ కరెంట్ అనే సమద్ర ప్రవాహం యొక్క స్థానం ఏమిటి.?
జ : హిందూ మహసముద్రం

2) ఉద్యమి భారత స్కీమ్ దేనికి సంబంధించినది.?
జ : సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమలకు

3) FAME ఇండియా పథకం లక్ష్యం ఏమిటి.?
జ : ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచడం

4) ‘భారత్’ అనే బ్రాండ్ నేమ్ ఏ కార్యక్రమానికి సంబంధించినది.?
జ : ఒక దేశం – ఒక ఎరువు

5) టెటానస్ వ్యాధి ఏ సూక్ష్మ జీవి వలన కలుగుతుంది.?
జ : క్లాస్ట్రీడియం

6) మలేరియా ను కలిగించే సూక్ష్మ జీవి పేరు ఏమిటి.?
జ : ప్లాస్మోడియం

7) ఎలిఫెంటియాసిస్ ను కలిగించే సూక్ష్మ జీవి పేరు ఏమిటి.?
జ : ఉఖరేరియా

8) కుతుబ్షాహీల కాలంలో హిందూ మరియు ముస్లిం ప్రముఖులు “కులా‌” మరియు “ఖబా” లతో కూడిన వస్త్రాలను ధరించేవారు వాటి అర్థం ఏమిటి?
జ : టోపీ మరియు పొడవైన కోటు

9) తెలంగాణలో ఆశ్రిత కులాల ప్రధాన వృత్తిగా ఏది పరిగణించబడుతుంది.?
జ : యాచించడం

10) న్యాయస్థానాలకు తమ విధుల నిర్వహణలో జవాబుదారితనంగా ఉండని పదవులు ఎవి.?
జ : రాష్ట్రపతి & గవర్నర్

11) “యాంకిల్ హోల్డ్” అనే పదం ఏ క్రీడకు సంబంధించినది.?
జ : కబడ్డీ

12) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో

13) “రన్నింగ్ హ్యాండ్ టచ్” అనే పదం ఏ క్రీడకు సంబంధించినది.?
జ : కబడ్డీ

14) మొదటి ఏ వీడియో గేమ్, 1971లో నోలన్ బుష్నెల్ మరియు టెడ్ డాబ్నీ ప్రారంభించారు.?
జ : “కంప్యూటర్ స్పేస్”

15) ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపం ఏది.?
జ : గ్రీన్‌ల్యాండ్ (దాదాపు 2.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది)

16) ప్రపంచంలో అతిపెద్ద డెల్టా, సుందర్బన్స్ ఎక్కడ ఉంది.?
జ : బంగ్లాదేశ్ మరియు భారతదేశంలో ఉంది

17) ప్రపంచంలోని అతిపెద్ద జలపాతం, నీటి పరిమాణం ప్రకారం, ఏది.?
జ : కాంగో నదిపై ఉన్న ఇంగా జలపాతం.

18) ప్రపంచంలోని అతిపెద్ద గల్ఫ్ ఏది.?
జ : గల్ఫ్ ఆఫ్ మెక్సికో (దాదాపు 615,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.)

19) కాకతీయుల కాలంనాటి పేరీణీ నృత్యాన్ని పునరుద్ధరించింది ఎవరు.?
జ : నటరాజ రామకృష్ణ

20) రాజ్యాంగలోని ఆదేశిక సూత్రాలలోని ఏ సూత్రం గాంధేయ సూత్రంగా పరిగణించబడుతుంది.?
జ : గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించడం

21) పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది.?
జ : పదవ షెడ్యూల్

22) ఏ ఆర్టికల్ ప్రకారం సివిల్ సర్వెంట్స్ కు రక్షణ కల్పించబడింది.?
జ : ఆర్టికల్ 311

23) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ డివైజ్ పార్కును ఎక్కడ స్థాపించింది.?
జ : సుల్తాన్ పూర్

24)ఖండకాద్యక, బ్రహ్మస్పుట సిద్దాంతం ఎవరిరచనలు ?
జ : బ్రహ్మగుఫ్తుడు

25) శాతవాహనుల కాలంలో బట్టలు తయారు చేయు వారిని ఏమని పిలుస్తారు.?
జ : పేసకారులు

26) శాతవాహనుల కాలంలో ఇత్తడి కార్మికులను ఏమని పిలుస్తారు.?
జ : కాసకారులు

27) ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ నంద్యాల అడవి ప్రాంతంలో కనిపించే బన్మనస్ అనే పదం దేనిని సూచిస్తుంది.?
జ : అటవీ తెగ వారు

28) పరిపాలన మరియు యుద్ధాలలో చురుకుగా పాల్గొన్న చాళుక్య యువరాణి ఎవరు.?
జ : అక్కదేవి

29) బృహత్కథ అనే గ్రంధాన్ని గుణాడ్యుడు ఏ భాషలో రచించాడు.?
జ : పైశాచి

30) ప్రపంచ జనాభా 8 బిలియన్లకు(800 కోట్లు) చేరిన రోజు ఏది.?
జ : 15 నవంబర్ 2022

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →