INDEPENDENCE DAY – భారత స్వాతంత్ర్య దినోత్సవం

BIKKI NEWS (AUG.15) : 79th independence day 2025. 200 సంవత్సరాల ఆంగ్లేయుల బానిస సంకెళ్ళను ఆగస్టు 15 – 1947 నాడు భరతమాత తెంచుకుంది. ఎంతోమంది భరతమాత ముద్దుబిడ్డల త్యాగాలు,పోరాటాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించింది.

79th independence day 2025.

2025 సంవత్సరం, 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ గర్వంగా జరుపుకుంటున్నారు.

అహింసతోనే స్వతంత్రాన్ని సాధించాలనే గాంధీ గారి ఆలోచన విధానం ప్రపంచ శాంతి మార్గానికి ఇప్పటికీ దారి చూపుతుంది.

స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా చేసిన ఉద్యమాలను సంక్షిప్తంగా చూద్దాం . స్వతంత్ర పోరాటంలో చరిత్రకారుల ప్రకారం మొదట మితవాదులు తర్వాత అతి వాదులు ఆ తర్వాత గాంధీ యుగం స్వంతంత్ర ఉద్యమంలో కీలక పాత్రలు పోషించిన సందర్భాలు.

స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య సందర్భాలు
  • సిపాయిల తిరుగుబాటు (1857)
  • స్వదేశీ ఉద్యమం (1905-11)
  • హోమ్ రూల్ ఉద్యమం (1906-18)
  • గదర్ ఉద్యమం (1913-17)
  • చంపారన్ తిరుగుబాటు (1917)
  • సహాయ నిరాకరణ ఉద్యమం (1920-22)
  • శాసన ఉల్లంఘన ఉద్యమం (1930)
  • వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమాలు (1940)