BIKKI NEWS (NOV. 21) : 3 TEACHERS SUSPENDED IN HUZURABAD MANDAL. హుజురాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
3 TEACHERS SUSPENDED IN HUZURABAD MANDAL
సస్పెండ్ అయిన వారిలో హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులు, హుజురాబాద్ మండలం చెల్పూర్ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.
హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫిజికల్ సైన్స్ టీచర్ చెల్పూర్ పాఠశాలకు పనిచేస్తున్న ఫిజికల్ సైన్స్ టీచర్ల ఉన్నారు.
హుజురాబాద్ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు మద్యం సేవించి హాజరైనట్లు ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరో ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, పాఠశాల కార్యక్రమాలలో సహకరించకపోవడం, విద్యార్థులను నిరుత్సాహపరచడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలిపారు.
ఈ ముగ్గురు ఉపాధ్యాయులు తమ ప్రవర్తనను మార్చుకోకుండా పదే పదే ఇవే చర్యలకు పాల్పడటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేసినట్లు డీఈవో స్పష్టం చేశారు.

