BIKKI NEWS (OCT. 17) : 1 LAKH BOGUS EMPLOYEES IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలోని పలు శాఖల్లో దాదాపుగా లక్ష మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
1 LAKH BOGUS EMPLOYEES IN TELANGANA.
బోగస్ ఉద్యోగుల పేరుతో నెలనెల జీతాలు తీసుకుంటూ దాదాపు 15 వందల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు తేలింది.
ప్రభుత్వ విభాగాలు, పలు శాఖల్లో దాదాపు లక్ష మంది బోగస్ ఉద్యోగులున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్టు మ్యాన్ పవర్ కంపెనీలు ఏర్పాటు చేసిన కొందరు నాయకులు, బడాబాబులు ఇదంతా దోచుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో బోగస్ ఉద్యోగుల జీతాలు అక్టోబర్ నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మాజీ సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో వేసిన త్రిసభ్య కమిటీ రిపోర్టులో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తేల్చిన కమిటీ, అందులో కేవలం రెండు లక్షల మంది పూర్తిస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
సెప్టెంబర్ 30 వరకు సగం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాంక్ ఖాతాలు, ఆధార్ వివరాలు ఇచ్చారు. మిగిలిన వారు అక్టోబర్ 25 వరకు ఆధార్ వివరాలివ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

