World Tourism day – ప్రపంచ పర్యాటక దినోత్సవం

BIKKI NEWS (SEP. 27) :World Tourism day on September 27th. 1980 నుండి సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినంగా ఐక్య రాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ప్రకటించింది.

World Tourism day on September 27th.

ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం.

ప్రపంచ పర్యాటక దినోత్సవం ముఖ్య కారణం పర్యాటకం ప్రాముఖ్యత, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విలువల పై ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అవగాహన పెంచడం, సృష్టించడం

ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులు( ప్రపంచం లోని ప్రజలు) నూతన గమ్యస్థానాలను చూడటానికి, విభిన్న సంస్కృతులను చూసి ఆనందించి, అనుభవించడానికి, శాశ్వత జ్ఞాపకాల కొరకు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా సరిహద్దులు దాటి ఆయా ప్రదేశాలను చూస్తారు. ఈ పర్యాటకులతో ప్రపంచ దేశాలలో ఉద్యోగాల కల్పన, పర్యాటకం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, లోకల్ గైడ్స్ వంటి వివిధ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటకులతో దేశాలలో ఆదాయం పెరిగే అవకాశం స్థానిక వ్యాపారాలకు, ప్రభుత్వ పన్ను ఆదాయానికి ఒక వనరు గా పర్యాటక రంగం ఉంటుంది.

One Comment on “World Tourism day – ప్రపంచ పర్యాటక దినోత్సవం”

Comments are closed.