Wimbledon 2025 – ఫైనల్స్ కు చేరింది వీరే

BIKKI NEWS (JULY 12) : WIMBLEDON 2025 FINALISTS. వింబుల్డన్ 2025 ఫైనల్స్ కు మహిళల సింగిల్స్ విభాగంలో పోలాండ్ కు చెందిన స్వియాటెక్ మరియు అనిసిమోవా అమెరికా నుండి చేరారు. శనివారం రాత్రి 8:30 గంటలకు ఈ ఫైనల్ జరగనుంది.

WIMBLEDON 2025 FINALISTS

అమెరికాకు చెందిన అనిసిమోవా ఈరోజు గెలిస్తే తన కెరీర్లో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరనుంది.

మరోవైపు ఇక ఆరవ గ్రాండ్ స్లామ్ టైటిల్ మీద కన్నేసింది. ఇప్పటికే నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్, ఒక్క యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.

మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ఇటలీ ఆటగాడు యానిక్ సినెర్ మరియు స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్ ఫైనల్ కు చేరారు.

అల్కరాజ్ టైటిల్ నెగ్గితే వింబుల్డన్ వరుసగా మూడోసారి నెగ్గి హ్యాట్రిక్ రికార్డును నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ రికార్డు జాన్ బోర్గ్, పీట్ సంప్రాస్, ఫెడరర్, జకోవిచ్ ల పేరు మీద ఉంది.

కార్లోస్ ఆల్కరాజ్ ఇప్పటికే 5 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గాడు. వీటిలో 2 ఫ్రెంచ్ ఓపెన్, 2 వింబుల్డన్ ఓపెన్, ఒక యూఎస్ ఓపెన్ ఉన్నాయి.

మరోవైపు సినెర్ ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2, యుఎస్ ఓపెన్ ఒకటి ఉన్నాయి.