BIKKI NEWS (SEP. 07) : WEST BENGAL TEACHERS CASE another jobs to them. సుప్రీం కోర్టు తీర్పుతో పశ్చిమ బెంగాల్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి బోధనేతర కొలువుల్లో నియమించడానికి న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
WEST BENGAL TEACHERS CASE another jobs to them
వారిని గ్రూప్-సీ, గ్రూప్-డీ పోస్టుల్లో నియమించే విషయంలో న్యాయ పరిష్కారం కోసం చూస్తున్నా’ అని వెల్లడించారు.
స్కూల్ సర్వీస్ కమిషన్ 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడి ఉద్యోగాల్లో చేరినవారు ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కేవలం 1806 మంది మాత్రమే ఈ ఉద్యోగం నియామాకాలలో అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో వీరిని ఉద్యోగం నుంచి తొలగించారు.
మొత్తం 25 వేలమందికి పైగా ఈ నోటిఫికేషన్ ద్వారా టీచర్ జాబ్స్ పొందారు.
అక్రమాలకు దూరంగా ఉన్నవారి పునర్నియామక ప్రక్రియ ప్రారంభమైందని ముఖ్యమంత్రి తెలిపారు..