BIKKI NEWS (JULY 21) : Welfare fund for gig workers in telangana. తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
Welfare fund for gig workers in telangana.
గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించే విధంగా పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు.
ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి గారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారితో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పాలసీ గురించి అధికారులు వివరించినప్పుడు ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు.
గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వ ప్రాతినిథ్యం వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.