UPI – యూపీఐ ద్వారా 5 లక్షలు ఒకేసారి చెల్లించవచ్చు

BIKKI NEWS (SEP. 10) : UPI PAYMENTS LIMIT UPTO 5 LAKHS – యుపిఐ లావాదేవీ పరిమితులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

UPI PAYMENTS LIMIT UPTO 5 LAKHS

బీమా ప్రీమియం, స్టాక్ మార్కెట్లు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి విభాగాలకు యూపీఐ ద్వారా ఒకేసారి రూ.5 లక్షల వరకు చెల్లించడానికి పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబరు 15 నుంచే ఇది అమల్లోకి వస్తాయి. ఇదే తేదీ నుంచి 24 గంటల్లో చేసే మొత్తం లావాదేవీ పరిమితిని సైతం వేర్వేరు విభాగాల్లో రూ.10 లక్షల వరకు పెంచింది.

సవరించిన పరిమితులు అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్, ప్రయాణ, వ్యాపార/ మర్చంట్ సంబంధిత లావాదేవీలకు రూ. 5 లక్షల పరిమితి వర్తిస్తుంది.

వ్యక్తి నుంచి వ్యక్తి చేసే లావాదేవీల పరిమితుల్లో ఎటువంటి మార్పు లేదు రోజుకు రూ. లక్షగానే ఉంది.