BIKKI NEWS (NOV. 19) : TSAT FREE COACHING FOR TET 2026. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల ప్రయోజనార్థం టీఎస్ఏటీ టీజీ టెట్ – 2026 డిజిటల్ ఫ్రీ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ & ఇండస్ట్రీస్ మంత్రి దుడ్డిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు.
TSAT FREE COACHING FOR TET 2026.
నవంబర్ 19న టెట్ ప్రత్యేక ఒరియెంటేషన్ సెషన్లు నిర్వహించబడతాయి. అనంతరం 44 రోజులపాటు మొత్తం 200 ఎపిసోడ్లతో నిరంతర కోచింగ్ ప్రసారం కానుంది.
ప్రసార వివరాలు: TSAT NIPUNA CHANNEL ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కోచింగ్ ప్రసారం అవుతాయి.
TSAT VIDYA CHANNEL ద్వారా ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు
ఈ రెండు ఛానళ్లలో రోజుకు మొత్తం 4 గంటల ప్రత్యేక పాఠాలు అందుబాటులో ఉంటాయి.
కవర్ చేయనున్న సబ్జెక్టులు: టెట్ పరీక్షకు అవసరమైన ముఖ్యాంశాలై…
- చైల్డ్ డెవలప్మెంట్ &PEDAGOGY,
- సైకాలజీ,
- ఫిజికల్ సైన్స్,
- బయాలజికల్ సైన్స్,
- గణితం,
- సామాజిక శాస్త్రం,
- అలాగే ఇంగ్లీష్, తెలుగు సహా ఇతర అవసరమైన పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయి.
పేపర్–1 మరియు పేపర్–2 అభ్యర్థులు ఈ డిజిటల్ పాఠాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
లెషన్స్ ఎక్కడ లభ్యం.?
- టీఎస్ఏటీ శాటిలైట్ ఛానళ్లు
- టీఎస్ఏటీ మొబైల్ యాప్
- యూట్యూబ్ అధికారిక ఛానల్
టీజీ టీటీ 2026 కు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఈ ఉచిత డిజిటల్ కోచింగ్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

