PTM – ప్రభుత్వ కళాశాలల్లో నేడే మెగా పేరెంట్ లెక్చరర్ మీటింగ్

BIKKI NEWS (SEP. 26) : Today Mega parent Lecturer meeting in GJCs. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేడు మెగా పేరెంట్ లెక్చరర్ మీటింగ్ జరగనుంది.

Today Mega parent Lecturer meeting in GJCs.

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ఇప్పటికే కళాశాలలు ఏర్పాటు చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందజేశాయి. కళాశాలల లెక్చరర్లు ఇంటింటికి వెళ్లి పేరెంట్స్ ను ఆహ్వానించడం కూడా జరిగింది.

పేరెంట్స్ లెక్చరర్ మీటింగులో విద్యార్థి యొక్క హాజరు శాతము ఇప్పటి వరకు నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల మార్కుల వివరాలతో కూడిన ప్రొగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేయనున్నారు.

అలాగే తల్లిదండ్రులకు కళాశాలలో నూతనంగా ప్రారంభించిన డిజిటల్ తరగతుల గదులను, ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలను కూడా చూపించనున్నారు.

అలాగే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, విద్యార్థి యొక్క అభ్యసన సామర్ధ్యాలపై తల్లిదండ్రులతో చర్చించి విద్యార్థులు ఇంటి వద్ద చదువుకోవడానికి అనుకూల వాతావరణం కల్పించాలని సూచించనున్నారు.

విద్యార్థి యొక్క పాజిటివ్ అంశాలను గుర్తించి వాటిని మరింత అభివృద్ధి పరిచేందుకు తల్లిదండ్రులతో చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించుకునేందుకు లెక్చరర్లకు మంచి అవకాశం.

మెగా పేరెంట్ లెక్చరర్ మీటింగ్ తో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది.