BIKKI NEWS (JAN. 07) : TGSRTC SPECIAL BUSSES TICKET RATES 1.5 TIMES HIKED. సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మొత్తం 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
TGSRTC SPECIAL BUSSES TICKET RATES 1.5 TIMES HIKED
ఈ ప్రత్యేక బస్సుల టికెట్ ఛార్జీలు జీఓ నెం.16 (2003) ప్రకారం గరిష్ఠంగా 1.5 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది
పెరిగిన చార్జీలు జనవరి 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో మాత్రమే అమలులో ఉంటాయి.
ఈ ఛార్జీలు ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తిస్తాయి (తెలంగాణ లోపల మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు కూడా కలుపుకొని).
MGBS, JBS, ఉప్పల్, ఎల్బీనగర్, కేపీహెచ్బీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
సాధారణ బస్సులలో టికెట్ ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయి.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం సంక్రాంతి రోజుల్లో కూడా కొనసాగుతుంది (పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో వర్తింపు).
ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని TGSRTC సూచించింది.

