- BIKKI NEWS : 27-02-2026
TGPSC RECRUITMENT AS PER TIMELINE SAYS BURRA VENKATESHAM. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియను ఇక నుంచి టైమ్ లైన్ ప్రకారం చేయనున్నట్లు చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. 2026 కమిషన్ పాలిట సంస్కరణల నామ సంవత్సరం అని తెలిపారు.
TGPSC RECRUITMENT AS PER TIMELINE SAYS BURRA VENKATESHAM
నోటిఫికేషన్ తేదీ, పరీక్షల షెడ్యూల్, ఫలితాలు విడుదల, నియామక పత్రాలు అందజేత వంటి వాటిని నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని తెలిపారు.
గతంలో మాదిరిగా ఏండ్లకొద్దీ నోటిఫికేషన్ల కోసం, ఫలితాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఇక ఉండబోదని అన్నారు.
సింగిల్ స్టేజ్ పరీక్షలను 3 నెలల్లో, మల్టీ స్టేజ్ పరీక్షలను 6 నెలల్లో గా పూర్తి చేస్తామని ప్రకటించారు.
గ్రూప్ 3 ద్వారా నియామకమైన అభ్యర్థులకు త్వరలోనే పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తామని చెప్పారు.
నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం లో 77వ గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు అమీరుల్లాఖాన్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, లక్ష్మీకాంత్ రాథోడ్, కార్యదర్శి ఎం.హరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

