BIKKI NEWS (SEP. 27) : Telangana panchayati elections may postpone 3 months. తెలంగాణ పంచాయతీ మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మూడు నెలలు వాయిదా పడే అవకాశం ఉంది.
Telangana panchayati elections may postpone 3 months.
ఈరోజు రాష్ట్ర హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై వాదనలు విన్న హైకోర్టు బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో జీవో ఎలా విడుదల చేస్తారని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించినట్లు సమాచారం. తుదుపరి విచారణ అక్టోబర్ 8 కి వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో హడావుడిగా ఎలక్షన్ లను నిర్వహించడానికి జీవోలు విడుదల చేసే బదులు, న్యాయస్థానాన్ని మరింత సమయం అడగొచ్చు కదా అని ఏజీని ప్రశ్నించినట్లు సమాచారం.
దీంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మూడు నెలలు సమయం అడిగే అవకాశం ఉంది. మూడు నెలల తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.