BIKKI NEWS (SEP. 24) : Telangana Guest junior lecturers renewal news. తెలంగాణ జూనియర్ కళాశాలల అతిధి అధ్యాపకుల సంఘం ప్రతినిధులు ఈరోజు డైరెక్టర్ కృష్ణ ఆదిత్యనీ గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సమక్షంలో కలిసి గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ ను రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Telangana Guest junior lecturers renewal news.
ఈ సందర్భంగా గెస్ట్ అధ్యాపకులకు సంబంధించిన పలు సమస్యలపైన వినతి పత్రం సమర్పించారు.
ముఖ్యంగా గత సంవత్సరం డిసెంబర్ నుంచి నేటి వరకు ఉన్నటువంటి పెండింగ్ శాలరీస్ అన్నిటిని కూడా విడుదల చేయాలని
1654 మంది గెస్ట్ అధ్యాపకుల్లో సుమారు 1200 అధ్యాపకులు డిస్టర్బ్ అయి ఉన్నారని వారిని సత్వరమే అడ్జస్ట్ చేసేలా చూడాలని
ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ ప్రొసీడింగ్ నీ సత్వరమే విడుదల చేయాలని విన్నవించడం జరిగిందని అధ్యక్షుడు యాకుబ్ పాషా తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు,యాకుబ్ పాషా కార్యదర్శి రాజకుమార్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం గౌడ్ ఉపేంద్ర చారి, రాంప్రసాద్, తిరుపతి, బిలాల్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.