BIKKI NEWS (JULY 22) : Telangana farmers news. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాద్యత జిల్లా కలెక్టర్లదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Telangana farmers news.
ఈరోజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సహచర మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది.
మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సామాన్యులను ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు. సస్సెండ్ చేయడానికైనా వెనుకాడబోము. క్షేత్రస్ధాయిలో కొంతమంది అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం ఉంది. ఇది పునరావృతం కాకుండా కలెక్టర్లు చూడాలి.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 8.65లక్షల దరఖాస్తుల్లో ప్రధానంగా సాదాబైనామా,సర్వేనెంబర్ మిస్సింగ్,అసైన్డ్ ల్యాండ్ ,అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్,సక్సెషన్ కు సంబంధించి సుమారు 6 లక్షలున్నాయి. వీటిని ఐదు విభాగాలుగా విభజించి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన జరిపి ఆగస్లు 15వ తేదీలోగా వీలైనన్ని సమస్యలను పరిష్కరించాలి.
సాదాబైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని కోర్టు తీర్పుకోసం వేచిచూడకుండా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్దం చేసుకోవాలి. జిల్లాల్లోని అసైన్డ్‌ల్యాండ్,లబ్దిదారుల వివరాలను ఈ నెల 30వ తేదీ లోగా ప్రభుత్వానికి పంపించాలి.
దరఖాస్తుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించకూడదు. తిరస్కారానికి గల కారణాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ఈనెల 27వ తేదీన జరిగే జీపీవోలకు,లైసెన్స్ డ్ సర్వేయర్లకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.