Telangana Engineers day – తెలంగాణ ఇంజనీర్ ల దినోత్సవం

Telangana engineers day - తెలంగాణ ఇంజనీర్ ల దినోత్సవం - bikki news

BIKKI NEWS (JULY 11) : Telangana Engineers day july 11th. తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. హైదరాబాదుకు చెందిన ఇంజనీరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జన్మదినమైన జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించింది .

Telangana Engineers day july 11th.

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. ఈయన 1877, జూలై 11న హైదరాబాదులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తెలంగాణ నీటిపారుదల పితామహుడిగానూ, తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, అప్పటి హైదరాబాద్ రాజ్యంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు.

ప్రభుత్వాలపై భారం పడకుండా దీర్ఘకాలం రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా తక్కువ ఖర్చు, నాణ్యతతో కూడిన సాగునీటి ప్రాజెక్టులు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిర్మించాడు.

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 2014, జూలై 10న జి.ఓ. నంబరు 18 జారీచేసి అలీ నవాజ్ జంగ్ బహాదూర్ ఆయన జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →