TG CABINET MEETING : ఆగస్టు 29న కేబినెట్ సమావేశం

BIKKI NEWS (AUG. 26) : Telangana cabinet meeting on 29th august. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29, 2025న మధ్యాహ్నం 3 గంటలకు, హైదరాబాదులోని డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.

Telangana cabinet meeting on 29th august.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రశ్నలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది

ఈ సమావేశం ఆగస్టు 25న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన మంత్రివర్గ కమిటీ నివేదిక సమర్పణ, రిజర్వేషన్ పెంపు అంశంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.