- BIKKI NEWS : 31-01-2026
STANDARD GK BITS 94 for compititive exams. – పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్
Standard GK Bits 94 for compititive exams
1) తెలంగాణలో పణిగిరి అనే గ్రామం దేనికి ప్రసిద్ధి చెందింది.?
జ : బుద్ధుని క్షేత్రము
2) జై బోలో తెలంగాణ సినిమాలో గారడి జేస్తుండ్రు అనే పాట రచయిత ఎవరు?
జ : కెసిఆర్
3) కురుమూర్తి జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి .?
జ : మహబూబ్ నగర్
4) తెలంగాణ ప్రథమ నవల ‘ప్రజల మనిషి’ రాసింది ఎవరు.?
జ : వట్టికోట అల్వార్ స్వామి
5) తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జియో ట్యాగ్ గుర్తింపు పొందినది ఏది.?
జ : పోచంపల్లి వస్త్రాల డిజైన్
6) కొమురం భీం యొక్క జన్మస్థలం.?
జ : జోడే ఘాట్
7) తెలంగాణ రాష్ట్రంలోని ఏ పండుగను పీర్ల పండుగ అని కూడా అంటారు.?
జ : మొహర్రం
8) భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది?
జ : రామేశ్వరం
9) అంతర్జాతీయ పోలీస్ సంస్థ అయిన ఇంటర్ పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : లయోన్స్
10) భూమి నుండి ఒక వస్తువు యొక్క పలాయన వేగం దేనిపై ఆధారపడుతుంది.?
జ : భూమి యొక్క ద్రవ్యరాశి & వ్యాసార్దం
11) లోహాలలో పాదరసం ఒక మూలకంగా ఉంటే దానిని ఏమని పిలుస్తారు.?
జ : అమాల్గం
12) సాకరైన్ అనేది ఒక.?
జ : కృత్రిమ తీపి కారకం
13) యురేకా అనే పదము ఏ శాస్త్రవేత్తతో సంబంధాన్ని కలిగి ఉంది.?
జ : ఆర్కిమెడిస్
14) ఫాస్పరస్ ను ఎందుకు నీటిలో ఉంచుతారు.?
జ : పొడిగాలి తగిలినప్పుడు నిప్పు అంటుకోకుండా
15) శత్రు విమానం యొక్క ఉనికిని కనుగొనడానికి రాడార్ దీనిని ఉపయోగించుకుంటుంది.?
జ : రేడియో తరంగాలు
16) తెలంగాణలో ప్రసిద్ధి చెందిన గొల్ల గట్టు జాతర ఎక్కడ జరుగుతుంది.?
జ : సూర్యాపేట
17) భారత రాజ్యాంగ సవరణ విధానం ఏ ఆర్టికల్ లో పేర్కొనబడింది.?
జ : ఆర్టికల్ 368
18) భారతదేశంలో యుద్ధమును ప్రకటించే అధికారం ఎవరికి కలదు.?
జ : రాష్ట్రపతి
19) ద్రవ్య బిల్లును మొదట ఏ సభలో ప్రవేశపెడతారు.?
జ : లోక్ సభలో
20) గాలిలో ధ్వని వేగం మార్పు దేని వలన కలుగుతుంది.?
జ : గాలి తేమ వల్ల
21) ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి రక్తం దేని ద్వారా ఎక్కిస్తారు.?
జ : సిరల ద్వారా మాత్రమే
22) కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా దేనిని కొలుస్తారు.?
జ : శిలాజాల వయస్సు
23) మొనింజైటిస్ అను వ్యాధి ఏ అంగమును బాధించును.?
జ : మెదడు
24) కొంకణ్ తీర ప్రాంతము ఏ రెండు పట్టణాల మధ్య విస్తరించి ఉంది.?
జ : గోవా – ముంబై
25) అద్భుత ఔషధ సృష్టి మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు.?
జ : ఎల్లాప్రగడ సుబ్బారావు
26) గుప్తుల కాలంలోని వరాహ మిహీరుడు రచించిన ప్రముఖ గ్రంథం ఏది?
జ : బృహత్ సంహిత
27) కోహినూర్ వజ్రాన్ని ఎక్కడ నుండి బ్రిటీష్ వాళ్ళు తీసుకెళ్లారు.?
జ : గోల్కొండ
28) చంద్రునిపై మానవుడు మొదటిసారిగా అడుగుపెట్టిన సంవత్సరం.?
జ : 1969
29) ఆనంద్ మఠ్ రచయిత ఎవరు.?
జ : బంకించంద్ర చటర్జీ
30) కుమార సంభవం రచించినది ఎవరు.?
జ : నన్నెచోడుడు

