BIKKI NEWS (SEP. 22) : Skill based education in intermediate. జాతీయ విద్యా విధానం -2020 సిఫారసు మేరకు 11, 12వ తరగతుల్లో నైపుణ్య ఆధారిత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
Skill based education in intermediate.
జాతీయ విద్యా విధానంలో నైపుణ్యాధారిత విద్య ప్రముఖంగా ఉందని చెప్పారు. గతంలో ఇది ఆప్షనల్ గా ఉండేదని ఇకపై విద్యలో ఇదో భాగంగా మారనుందన్నారు.
ఒక సర్టిఫికెట్ లేదా డిగ్రీకే విద్యా విధానం పరిమితం కారాదని, విద్యార్థులను పోటీకి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆరో తరగతి నుంచే నైపుణ్య ఆధారిత విద్యా బోధనను ప్రవేశపెట్టే యోచన ఉందని మంత్రి వివరించారు.