BIKKI NEWS (JULY 18) : SFI demands for guest lecturers renewal. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం అయి మూడు నెలలు అవుతుంది.కళాశాలలలో కోన్ని సబెక్టులకు భోధిస్తున్న అతిథి అధ్యాపకులను రెన్యూవల్ చేయలేదు. దీని వల్లన జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున కళాశాలలు ప్రారంభమైతే ఇప్పటివరకు రాష్ట్రంలో కోన్ని సబెక్టులకు పాఠాలు జరగడం లేదు. రాష్ట్రంలో 1654 మంది అతిథి లెక్చరర్లు పని చేస్తున్నారు. గతంలో విద్యార్థులు అకడమిక్ పరంగా నష్టపోకుండా తమ సేవలు అందించారని వారిని తక్షణమే రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం జీ.వో. విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.
SFI demands for guest lecturers renewal
ఒక్క ప్రక్క కార్పోరేట్ కళాశాలలు తమ సిలబస్ పూర్తిచేసి పోటి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ప్రభుత్వ కళాశాలలో మాత్రం కొన్ని సబెక్టులకు చదువులు కోనసాగడం లేదు. తాత్కాలిక పద్దతిలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న అతిథి అధ్యాపకులను లెక్చరర్లను నియమించాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది.
ప్రభుత్వానికి ఇప్పటికే ప్రిన్సిపాల్స్ తమకు స్టాప్ కావాలని విజ్ఞాపనలు కూడా పంపారని లెక్చరర్లను తక్షణమే నియమించాలని కోరారు.
ఇంటర్ కమిషనర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం నుండి జీ.వో. ఇచ్చి అతిథి అధ్యాపకులను కోనసాగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది.