BIKKI NEWS (SEP. 07) : SC Gurukulas Employees Increament news. తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ విడుదల కోసం వింత నిబంధనను విధించినట్లు ఉద్యోగులు వాపోతున్నారు.
SC Gurukulas Employees Increament news
పదోన్నతి పొందే అర్హతలు ఉంటేనే ఇంక్రిమెంట్ చేస్తామని ప్రిన్సిపాల్స్ సంబంధిత డిగ్రీ లెక్చరర్లకు తేల్చి చెప్పడంతో విస్తుపోవడం లెక్చరర్ల వంతయింది. లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు లేని ఇలాంటి నిబంధనను తమకు మాత్రమే విధించడం పట్ల 2019 ఆగస్టు లో విధుల్లోకి చేరిన డిగ్రీ లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
2018 ఆగస్టులో తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు ద్వారా నియమితులై 2019 ఆగస్టు లో విధుల్లోకి చేరిన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తింప చేయడం విచిత్రం.
2017 నోటిఫికేషన్ ద్వారా నియమితులై, 2019లో మార్చిలో నియమితులైన వారికి మాత్రం ఇంక్రిమెంట్లను విడుదల చేయడం విశేషం.