2nd Increament – రెండో ఇంక్రిమెంట్ అందించండి

BIKKI NEWS (JULY 20) : sanction of 2nd Increament to regularised junior lecturers .తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2023లో రెగ్యులర్ అయిన జూనియర్ లెక్చరర్లకు వెంటనే రెండో ఇంక్రిమెంట్ అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.

sanction of 2nd Increament to regularised junior lecturers

2023 మే 4వ తేదీన రెగ్యులర్ అయిన జూనియర్ లెక్చరర్ లను రెండవ ఇంక్రిమెంట్ విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఇంటర్ విద్యా డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.

అలాగే రెగ్యులర్ అయిన ఈ ఉద్యోగుల ఉద్యోగ సమాచారం సంబంధించి పోలీసు వెరిఫికేషన్, ప్రొబేషన్ పూర్తి, రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం జోనల్ అలాట్మెంట్, రోస్టర్ అమలు వంటి అంశాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాలను పరిశీలించి పూర్తి చేయడానికి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.