దసరా సెలవుల్లో విద్యాసంస్థలను నడపకుండా చర్యలు తీసుకోవాలి. – SFI

  • విద్యాసంస్థలను నడిపితే ప్రతక్ష్య ఆందోళనలు చేపడతాం: ఎస్.ఎఫ్.ఐ.రాష్ట్ర కమిటీ

BIKKI NEWS (SEP. 21) : Running of schools in dasara holidays. ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలను నడిపకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాని కోరింది.

Running of schools in dasara holidays

రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన కార్పోరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు నడుపుతున్నారని విద్యాసంస్థలు నడపకుండా చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులు విద్యాసంస్థలకు దాసోహం అవుతూ తాయిలాలు తీసుకుని చర్యలు తీసుకోవడం లేదన్నారు.

దసరా సెలవుల్లో విద్యాసంస్థలు నడిపితే విద్యాసంస్థల ముందు ప్రతక్ష్య ఆందోళనలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు లుతెలిపారు.