RRB GROUP D JOBS – పదో తరగతితో 22 వేల ఉద్యోగాలు

RRB GROUP D 22000 JOBS NOTIFICATION - 2026

BIKKI NEWS (JAN. 05) : RRB GROUP D 22000 JOBS NOTIFICATION – 2026. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దాదాపు 22 వేల గ్రూవ్ డీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే జోన్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

RRB GROUP D 22000 JOBS NOTIFICATION – 2026

పదో తరగతి,‌ ఐటీఐ అర్హతతో ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు : ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ లో వివిధ కేటగిరీ పోస్టులు – 22 వేలు

అర్హతలు : పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత

వయోపరిమితి : 2026 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.( రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :
మొదటి దశ – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (100 మార్కులకు)
రెండో దశ : ఫిజికల్ ఎఫిషియోన్సీ టెస్ట్

వేతనం : నెలకు 25 వేల వరకు ఉంటుంది.

సిలబస్ : జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ – రీజనింగ్, కరెంట్ అఫైర్స్

పరీక్ష తేదీ : 2026 జూన్ లో నిర్వహించే అవకాశం ఉంది.

వెబ్సైట్ : https://rrbsecunderabad.gov.in/