BIKKI NEWS (DEC. 19) : RETIERD GAZETTED OFFICERS DEMANDING FOR NEW PRC. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు వెంటనే నూతన పీఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.
RETIERD GAZETTED OFFICERS DEMANDING FOR NEW PRC
అలాగే పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన రోజునే ప్రయోజనాలు కల్పించాలని కోరింది.
గురువారం సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ నారాయణ, నర్సరాజులు మాట్లాడుతూ… ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.

