- ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య ను కలిసి వినతిపత్రం అందజేసిన గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
BIKKI NEWS (AUG. 22) : Requesting for continuation of 1654 guest lecturers. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని కోరుతూ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారిని గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, సంయుక్త కార్యదర్శులు కె. వెంకటేష్, బి. నాగరాజు లు మర్యాదపూర్వకంగా కలిసి అభ్యర్థించారు .
Requesting for continuation of 1654 guest lecturers.
ప్రభుత్వ ఆమోదం కోసం 1654 పోస్టులకు ప్రతిపాదనలు పంపినట్లు కమిషనర్ తెలిపారని, తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని, మంత్రులతో మాట్లాడి, అధికారులకు జూనియర్ కాలేజీలలో గెస్ట్ లెక్చరర్ల అవసరాన్ని వివరించి తప్పకుండా అనుమతి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారుమని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
గత విద్యా సంవత్సరంలో TGPSC ద్వారా రెగ్యులర్ లెక్చరర్ల నియామకం ద్వారా డిస్టర్బ్ కావడంతో మంత్రులను, ప్రభుత్వ పెద్దల దృష్టికి గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను తీసుకెళ్లగా, అసెంబ్లీలోనే మంత్రి దామోదర రాజనర్సింహ రెగ్యులర్ లెక్చరర్ల నియామకం అయినా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వారెవరికీ ఇబ్బంది కలగనీయమని, అందరినీ కొనసాగిస్తామని అవసరమైతే అదనపు పోస్టులను మంజూరు చేస్తామని ప్రకటించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రేస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో హామీ ప్రకారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గత 12 సంవత్సరాలు గా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల రెన్యువల్ మరియు రెగ్యులర్ లెక్చరర్ల నియామకం వల్ల డిస్టర్బ్ ఐన వారిని అడ్జస్ట్ మెంట్ చేయడం కోసం సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటర్ బోర్డు కార్యదర్శి గారు తేది:13-06-25 న ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన 1654 గెస్ట్ ఫ్యాకల్టీ కంటిన్యూయేషన్ ఫైల్ లో ఫైనాన్స్ అధికారులు వివిధ కారణాలు చూపి పోస్టుల సంఖ్య తగ్గింపు చేసి కేవలం 398 పోస్టులకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. అదే జరిగితే దాదాపు 1300 మంది కుటుంబాలు రోడ్డున పడనున్నాయని వాపోయారు.