HOLIDAY – మరో జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు

BIKKI NEWS (AUG. 27) : Rain holiday to Nirmal district on 28th august. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (గురువారం) నిర్మల్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు.

Rain holiday to Nirmal district on 28th august

విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం రోజు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రేపు (ఆగస్టు 28) జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఒకరోజు సెలవు అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132లో సంప్రదించవచ్చని తెలిపారు.

ఇప్నటికే కామారెడ్డి , మెదక్ జిల్లాలకు గురువారం రోజున విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.