BIKKI NEWS (AUG. 19) : Rain alert to telangana districts next 3 days. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain alert to telangana districts next 3 days.
బుధవారం రోజున మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గురువారం రోజున సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
శుక్రవారం రోజున ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.