Rain alert – భారీ వర్షాలు నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

BIKKI NEWS (AUG. 27) : Rain alert in Telangana. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు, అధికారులకు కీలక సూచనలు చేశారు.

Rain alert in Telangana.

పురాతన ఇల్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉన్న ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

వాగులు, వంకలు మీద ఉన్న కల్వర్టుల మీద ప్రయాణాలను నిలిపివేయాలని సూచించారు.

చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు

తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు. మిగతా 31 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.