PM KISAN : కొత్తవారికి అందని కిసాన్ సమ్మాన్ నిధులు

BIKKI NEWS (AUG. 17) : PM KISAN SAMMAN NIDHI NOT CREDITED. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నిధులను కొత్త రైతులకు జమ చేయలేదు వారు ఆందోళనలో ఉన్నారు.

PM KISAN SAMMAN NIDHI NOT CREDITED

ఈ పథకం కింద కొత్తగా నమోదైన రైతుల ఖాతాల్లో ఈ ఏడాది ఆగస్టు 2న విడుదల చేసిన నగదు ఇంతవరకు జమ కాలేదు.

ఈ ఏడాది కొత్తగా నమోదైన రైతుల యొక్క దరఖాస్తులను పరిశీలించవలసిందిగా కేంద్రం నుండి రాష్ట్రానికి ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఈ పథకం కింద నూతనంగా దరఖాస్తు చేసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమపై సందేహాలు నెలకొన్నాయి.

అలాగే రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులను ఈ పథకం కింద అందజేయాలని కేంద్రం భావించింది. దీని కొరకు 60% పైగా రౌతులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కార్డులు కూడా ఇంతవరకు జారీ చేయబడలేదు.

ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాలో నగదును కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసింది‌