PHYSICS WALLAH – విద్యార్థులు ఎలా ఎన్‌రోల్ చేసుకోవాలంటే

BIKKI NEWS (JULY 17) : Physics wallah free enrollment process. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎఫ్‌సెట్, నీట్, జెఈఈ, క్లాట్, సీఏ, వంటి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడానికి ఫిజిక్స్ వాలా తో ఒప్పందం చేసుకుంది.

Physics wallah free enrollment process.

జులై 15 నుండి ఫిజిక్స్ వాలా తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక టైం టేబుల్ అమలవుతున్న సంగతి తెలిసిందే.

విద్యార్థులు నేరుగా ఫిజిక్స్ వాలా పోర్టల్ లేదా యాప్ లో విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకునే విధానం ఇవ్వడం జరిగింది.

విద్యార్థులు గూగుల్ క్రోమ్ లో wp.live అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మొదటి వెబ్సైట్ నే క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదా ప్లే స్టోర్ లో wp.live app ను డౌన్లోడ్ చేసుకోవాలి.

తర్వాత మొబైల్ నెంబర్ తో ఓటీపీ ద్వారా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు విద్యార్థులు ఫిజిక్స్ వాలా పోర్టల్ లేదా యాప్ లో సెర్చ్ బార్ లో Telangana Achievers 2026 అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.

అనంతరం వచ్చిన లిస్టులో బైపిసి విద్యార్థులు ఎఫ‌‌సెట్/నీట్ 11వ తరగతి, 12వ తరగతి టింగ్లీష్/ఇంగ్లీష్ కోర్సులను సెలెక్ట్ చేసుకుని ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపీసీ విద్యార్థులు ఎఫ్‌సెట్/ జేఈఈ 11వ తరగతి, 12వ తరగతి టింగ్లీష్ / ఇంగ్లీష్ కోర్సులను ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

తదనంతరం స్టడీ విభాగంలోకి వెళ్లి మై బ్యాచెస్ లో ఉన్న సబ్జెక్టులను ఎంచుకొని ఉచితంగా డిజిటల్ తరగతులు వినవచ్చు.