BIKKI NEWS (AUG. 19) : Out Sourcing Employees renewal in school education. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 412 మంది ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న ఉద్యోగులను రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Out Sourcing Employees renewal in school education
వీరి సేవలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీఓలు జారీ చేశారు.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తులో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 173 మందిని ఎస్సీఈఆర్టీలో ఔట్ సోర్సింగ్ కింద 28 మందిని, ప్రభుత్వ డైట్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ 211 మందికి ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2026 మార్చి 31వ తేదీ వరకు రెన్యువల్ కు అనుమతి లభించింది.