BIKKI NEWS (JAN. 04) : OD FACILITY FOR TEACHERS WHO TAKE TET EXAM. టెట్ రాస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు ఆన్ డ్యూటీ కల్పించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్, ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారు.
OD FACILITY PROPOSAL FOR TEACHERS WHO TAKE TET EXAM
TGTET-జనవరి 2026 పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జనవరి 3, 2026 నుండి జనవరి 20, 2026 వరకు జరుగుతున్నాయి.ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, KGBV, మోడల్ స్కూల్స్ మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న 71,670 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ పరీక్షకు హాజరయ్యే ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు పరీక్ష రోజున ‘ఆన్ డ్యూటీ’ (OD) సౌకర్యం లేదా ప్రత్యేక సెలవు (Special Leave) కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
ఈ నేపథ్యంలో డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఇచ్చే విధంగానే, మొదటిసారి TET పరీక్ష రాస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఒకసారికి పరిమితం చేస్తూ ‘ఆన్ డ్యూటీ’ సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది.

