BIKKI NEWS (DEC. 24) : NEW RULES FROM JANUARY 1st 2026. జనవరి 1 నుంచి పలు కీలక మార్పులు రాబోతున్నాయి.
NEW RULES FROM JANUARY 1st 2026
1) ప్రస్తుతం క్రెడిట్ స్కోర్ 15 రోజులకు ఒక సారి అప్ డేట్ అవుతుంటే ఇకపై ప్రతి వారం క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల డేటాను అప్ డేట్ చేయనున్నాయి.
2) 2026 జనవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.
3) యూపీఐ, డిజిటల్ చెల్లింపులపై నింబధనలు, పాన్ కార్డు, ఆధార్ లింకేజీపై నిబంధనలు మరింత కఠిన తరంగా అమలయ్యే అవకాశం ఉంది.
4) పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం చేయకపోతే బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగే అవకాశ ఉంది.
5) ఇక నుంచి సోషల్ మీడియా యాప్ లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది. వెరిఫికేషన్ చేశాకే వాడేలా మార్పులు చేయాలని టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి యాప్స్ కు కేంద్రం ఆదేశించింది.
6) జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
7) 2026 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ కూడా పెరగనుంది.
8) ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాల ద్వారా డెలివరీలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

