Ration cards – 3.58 నూతన రేషన్ కార్డులు

BIKKI NEWS (JULY 13) : New ration cards issue in telangana. తెలంగాణ రాష్ట్రంలో జులై 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా 3,58,187 నూతన రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ మేరకు మంత్రి మొత్తం కుమార్ రెడ్డి ప్రకటన జారీ చేశారు.

New ration cards issue in telangana.

ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిరంతరం చేపడుతుందని మంత్రి తెలిపారు.

నూతన రేషన్ కార్డుల పంపిణీ తో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,56,625 కు చేరనుంది. లబ్ధిదారుల సంఖ్య 3,09,30,911 కు చేరనుంది.