Recharge – పెరగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు

BIKKI NEWS (NOV. 09) : Mobile recharge charges may hike 10% from December 1st. మొబైల్ రీఛార్జ్ ధరలు డిసెంబర్ 10 నుండి 12% పెంచడానికి పలు కంపెనీలు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Mobile recharge charges may hike 10% from December 1st

టెలికం దిగ్గజాలైన భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి.

ఇప్పటికే 1 జిబి ప్లాన్ డేటాలను ఎత్తేసిన కంపెనీలు రీఛార్జి ధరలను మరింత పెంచనున్నాయి.

గతేడాది 23% పెంచిన కంపెనీలు ఈ ఏడాది మరో 10 నుండి 12 శాతం పెంచే అవకాశం ఉంది.

మొబైల్ డేటా వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే టాప్ పొజిషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

నిర్వహణ ఖర్చులు, 5జి నెట్వర్క్ విస్తరణ వంటి అంశాల నేపథ్యాన్ని చూపిస్తూ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జి ధరలను పెంచనున్నాయి.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK